ఉద్యోగ భద్రతకు డిమాండ్
తాండూరు రూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వంజీపీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేక బడ్డెట్ కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. జీఓ నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 27, 28 తేదీల్లో ఎంపీడీఓ కార్యాలయం ఎదట ధర్నా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే జనవరి 4 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రాములు, అంజిలప్ప, లక్ష్మి, ప్రేమ్ తదితరులు ఉన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment