మంత్రి తుమ్మల తోటకు రైతులు
ధారూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సాగుచేసిన పామాయిల్ తోటను మంగళవారం ధారూరు మండల రైతులు సందర్శించారు. జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, ఏడీఏ వినోద్‌కుమార్, రైతు సంఘం మండల అధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్, ఏఓ సూర్యప్రకాశ్, ఏఈఓ సంతోష్‌బృందం అక్కడకు వెళ్లి పరిశీలించారు. వ్యవసాయ అధికారులు రైతులకు పామాయిల్ సాగు విధానా న్ని వివరించారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం 90 శాతం సబ్సిబీ అందిస్తుందని చెప్పారు. ఒక మొక్క ఖరీదు రూ.340 కాగా సబ్సిడీపై రూ.20 చెల్లించి పొందవచ్చని వారు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment