మామిళ్ల ఎల్లమ్మ తల్లికి బోనం
మూడవ రోజుకు చేరిన శ్రీతుల్జా భవానీ మాత జాతర ఉత్సవాలు
మండల పరిధిలోని నాగారం గ్రామంలో ఈ నెల 22న ప్రారంభమైన శ్రీతుల్జా భవానీ మాత జాతర ఉత్సవాలు మంగళవారం మూడవ రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా మామిళ్ల ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మహిళలు స్నానమాచరించి బోనాలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో నిర్వాహకులు నరోత్తంరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. – ధారూరు
Comments
Please login to add a commentAdd a comment