క్రిస్టియన్ల అభ్యున్నతికి కృషి
కొడంగల్: క్రిస్టియన్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విందు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశారన్నారు. కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, ప్రత్యేకాధికారి హన్మంత్‌రావు, తహసీల్దార్లు విజయ్‌కుమార్, మహేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు నందారం ప్రశాంత్, కృష్ణంరాజు, నర్సింలు గౌడ్, బాల్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, శంకర్ నాయక్, ఆసిఫ్‌ఖాన్, ఆనంద్‌రెడ్డి, రాంరెడ్డి, ఎస్‌ఎమ్ గౌసన్ తదితరులు పాల్గొన్నారు.
జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
కుల్కచర్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్లకు కేక్‌లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేకేఎంఆర్ కోఆర్డినేటర్ రాంచంద్రయ్య మాట్లాడుతూ.. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతి కృషి చేస్తున్నారని చెప్పారు.
జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment