నేడు బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్‌కు నరేందర్‌రెడ్డి
కొడంగల్: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌కు రానున్నారు. లగచర్ల ఘటనలో నిందితునిగా ఉన్న ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బొంరాస్‌పేటకు వస్తున్నారు. అక్కడి నుంచి కొడంగల్‌కు వచ్చి కార్యకర్తలను కలుస్తారని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
విద్య వైజ్ఞానిక మహాసభలను
విజయవంతం చేయాలి
అనంతగిరి: ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే టీఎస్ యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్‌లోని జెడ్పీ కార్యాలయం ఆవరణలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఇద్దరు విద్యార్థినుల ఎంపిక
కుల్కచర్ల: సీఎం కప్ క్రీడల్లో భాగంగా కుల్క చర్ల మండలం ముజాహిద్‌పూర్ జెడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం వికారాబాద్‌లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో 3వేల మీటర్ల రన్నింగ్ విభాగంలో మనీషా ప్రథమ స్థానం, నందిని ద్వితీయ స్థానంలో నిలిచారు. 800ల మీటర్ల రన్నింగ్ బాలికల విభాగంలో అంకిత మొదటి స్థానం, గాయత్రి ద్వితీయస్థానంలో నిలిచారు. మనీషా, అంకిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 31న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు మహ్మద్ సోహెల్
బంట్వారం: వికారాబాద్‌లో జరిగిన సీఎం కప్ టోర్నమెంట్‌లో జిల్లాస్థాయి పోటీల్లో బంట్వారం మోడల్ స్కూల్ విద్యార్థి మహ్మ ద్ సోహెల్ ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 200 మీటర్ల బాలుర విభాగం పరుగు పందెంలో సత్తాచాటాడు. మంగళవారం స్కూల్ ప్రిన్సిపాల్ బ్యూలా, సిబ్బంది విద్యార్థిని అభినందించారు.
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
● డీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
అనంతగిరి: పార్లమెంట్ సమావేశాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డీసీసీ అధ్యక్షక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్.టి.రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం వికారాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ను అవమానపరిచే విధంగా అమిత్‌షా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహోన్నత వ్యక్తి పట్ల చులకనగా మాట్లాడటం బాధాకరమన్నారు. అమిత్‌షా భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, సీనియర్ నాయకులు షరీఫ్, వెంకట్‌రెడ్డి, వేణు, నర్సింగ్‌నాయక్, సతీష్‌రెడ్డి, మల్లేశం, రహీంతదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment