కుక్కల దాడిలో మేక, గొర్రె పిల్లలు మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో మేక, గొర్రె పిల్లలు మృతి

Published Tue, Dec 24 2024 7:15 AM | Last Updated on Tue, Dec 24 2024 7:15 AM

కుక్కల దాడిలో మేక, గొర్రె పిల్లలు మృతి

కుక్కల దాడిలో మేక, గొర్రె పిల్లలు మృతి

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం గాజీపూర్‌లో ఊరకుక్కల దాడిలో మేక, గొర్రె పిల్లలు మృతి చెందాయి. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుద్దారం లక్ష్మప్ప గొర్రెలు, మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం జీవాలను మేత కోసం పొలాలకు తోలుకెళ్లాడు. ఈ క్రమంలో గొర్రె, మేక పిల్లలను ఇంటి వద్ద జాలీలో ఉంచాడు. మధ్యాహ్న సమయంలో ఊరకుక్కలు జాలీలోకి దూకి గొర్రె, మేక పిల్లలను చంపేశాయి. గమనించిన చుట్టుపక్కల వారు కుక్కలకు తరిమేశారు. అప్పటికే 5 మేక పిల్లలు, రెండు గొర్రె పిల్లలు మృతి చెందాయి. సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మప్ప విషయం తెలుసుకొని ఆందోళనకు గురయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement