విద్య, వైద్య రంగాలకు కృషి
కొడంగల్: నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసిన ట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గురువారం పట్టణ శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో రూ.23 కోట్లా 45 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులు, భవన నిర్మాణాలకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి కలెక్టర్ భూమిపూజ చేశారు. బీసీ గురుకులంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. కొత్త మె నూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని అడిగా రు.గురుకుల పాఠశాలలో ప్రస్తుతం ఉన్న విద్య మౌ లిక సదుపాయాలపై ఆరా తీశారు. సమీప భవిష్యత్తులో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు అంబయ్యగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ పాల్గొన్నారు.
● కలెక్టర్ ప్రతీక్ జైన్
Comments
Please login to add a commentAdd a comment