ఆప్యాయ పలకరింపే ప్రథమ చికిత్స కావాలి
● పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ ● బొంరాస్‌పేట పీహెచ్‌సీ సందర్శన
బొంరాస్‌పేట: వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఆప్యాయ పలకరింపేప్రథమ చికిత్స కావాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్‌సీలో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఓపీని పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సూపర్‌వైజర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ప్రతి కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకొని విజయవంతం చేయాలన్నారు. సూపర్‌వైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఇరుగు పొరుగు జిల్లాల వారితో సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. ల్యాబ్ నమూనాలు సేకరించి అవసరమైన వాటినే టీహబ్‌కు పంపాలన్నారు. పీహెచ్‌సీలో ఎన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని ల్యాబ్ టెక్నిషియన్‌ను అడగ్గా ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల బాధ్యత లేకుండా ఉండరాదని, కనీస సమాచారం లేకుండా ఎలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. డీఐఓ బుచ్చిబాబు, ఉప సంచాలకులు జీవరాజ్, శ్రీనివాస్, పీఓ పవిత్ర, వైద్యాధికారులు హేమంత్, అక్షయ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment