పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే
● సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి
చేవెళ్ల: పేదలు, కార్మికులు, కర్షకుల పక్షాన పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి అన్నారు. మండల కేంద్రంలో గురువారం సీపీఐ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ పరిష్కరించిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి నిజాం దొరలను తరిమికొట్టినట్లు చెప్పారు. దున్నే వాడికే భూమి అనే నినాదంతో లక్షలాది ఎకరాలు పేదలకు పంచిందన్నారు. బ్యాంకులను జాతీయం చేయటంలో ప్రధానపాత్ర పోషించిందన్నారు. ఈ సందర్భంగా 100 వసంతాల కేక్‌ను కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. నాయకులు ఎం.ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, జె.అంజయ్య, వడ్ల మంజుల, సుధాకర్‌గౌడ్, శ్రీనివాస్, కృష్ణగౌడ్, శివ, యాదగిరి, మీనాక్షి, లలిత, వెంకటమ్మ, రమాదేవి, శ్రీకాంత్, పెంటయ్య, కృష్ణచారి, పోచయ్య ఉన్నారు.
మొయినాబాద్: సీపీఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మొయినాబాద్‌లో ఎర్రజెండాను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి, మండల కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు జంగయ్య, జహంగీర్, జలీల్ పాల్గొన్నారు.
కొందుర్గులో..
కొందుర్గు: మండల కేంద్రంలో గురువారం సీపీఐ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుద్దుల జంగయ్య గురువారం బస్టాండ్ ఆవరణలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 100 ఏళ్లుగా పేదల పక్షాన పోరాటం చేస్తూ, పేద, బడుగుల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకుసాగుతున్న పార్టీ సీపీఐ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment