మాతాశిశు సంరక్షణకు చర్యలు
ఎంసీహెచ్ ప్రోగ్రాం జిల్లా అధికారి పవిత్ర
బంట్వారం: మాతాశిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎంసీహెచ్ ప్రోగ్రాం జిల్లా అధికారి పవిత్ర అన్నారు. బుధవారం కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరశీలించారు. ఈ సందర్భంగా ఆమె మెడికల్ ఆఫీసర్ మేఘనకు పలు సూచనలు చేశారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం మందులను పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మేఘన, డాక్టర్ బీబీ జానీ, ఫార్మసిస్ట్ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌కు పట్నం నరేందర్‌రెడ్డి
బొంరాస్‌పేట: లగచర్ల ఘటనలో ఏ–1 ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బుధవారం స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చారు. బెయిల్‌పై ఉన్న ఆయన కోర్టు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం స్థానిక ఠాణాలో హాజరు కావాల్సి ఉండగా వచ్చారు. స్టేషన్ నుంచి బయటికి వచ్చిన నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. మండలంలోని మెట్లకుంట చెక్‌పోస్టు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు నరేందర్‌రెడ్డిని కలిశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, కోట్ల మహిపాల్, యాదగిరి, నెహ్రూ నాయక్, తిరుపతయ్య, వాహబ్, హీర్యానాయక్, తదితరులు ఉన్నారు.
పాఠశాలలో
పాము కలకలం
● భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
● పట్టుకొని అడవిలో వదలిపెట్టిన స్నేక్ స్నాచర్
దోమ: మండలంలోని బడేంపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నాగుపా ము కలకలం రేపింది. స్కూల్ ఆవరణలో పా మును చూసిన విద్యా ర్థులు భయాందోళనతో పరుగులు తీశారు. వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. పాఠశాల చుట్టూ పొలాలు ఉండటంతో పాము ఇక్కడికి వచ్చి ఉంటుందని స్థానికులు తెలిపారు. ఉపాధ్యాయులు స్నేక్ స్నాచర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను పాఠశాలకు చేరుకొని పామును పట్టుకొని సమీప అడవిలో వదిలిపెట్టాడు. దీంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు. అయితే తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతోనే పాము లు సంచరిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికై నా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరారు.
సమావేశంపై వాగ్వాదం
కందుకూరు: ఫ్యూచర్ సిటీ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు చేపట్టిన సమావేశం విషయమై అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం లేమూరు రెవెన్యూ పరిధిలో ఫ్యూచర్ సిటీ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో భూసేకరణ విషయమై చర్చించడానికి ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న లేమూరు రైతులతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని రైతులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆర్డీఓ మరోసారి భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమవుదామని చెప్పి అక్కడి నుంచి అందరినీ పంపించి వేశారు.
Comments
Please login to add a commentAdd a comment