మరకత శివాలయం మహాద్భుతం
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఏదో తెలియని మహిమ దాగుందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప మనుమడు, అమేయ గ్రేగ్ గ్రూప్ అధినేత నిఖిల్ చంద్ర ముళ్లపూడి, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, సినీ నటి కారుణ్య చౌదరి అన్నారు. బుధవారం వారు ఆలయాన్ని దర్శించారు. లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ దేవాలయ ప్రాముఖ్యత, విశిష్టత గురించి ఎంతో మంది చెప్పారని.. ఈరోజు ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆలయంలో ఏదో అద్భుత శక్తి దాగి ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని సన్మానించి, మరకత శివాలయ పటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్‌చైర్మన్ శేఖర్, సభ్యులు హనుమంతు, మాజీ సర్పంచి శ్రీనివాస్, అర్చకుడు శివసాయి ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment