బెదిరింపులకు జంకొద్దు
అనంతగిరి: సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు ప్రజలు జంకరాదని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం వికారాబాద్‌లోని వికాస్ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల డిజిటల్ అరెస్టు అనే మోసపూరితమైన బెదిరింపుతో అమాయక ప్రజలకు ట్రాయ్, సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ అధికారుల మంటూ ఫోన్లు, వాట్సా ప్, టెలిగ్రాం కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అమా యక ప్రజల్ని భయపెట్టి కోట్లలో డబ్బు కాజేస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ మోసం జరిగిందని భావిస్తే వెంటనే సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
పోలీస్ అధికారులకు సన్మానం
ఇటీవల దౌల్తాబాద్ పీఎస్ పరిధిలో 2022లో నమోదైన అత్యాచారం కేసులో నిందితునికి జీవితఖైదు పడేలా పని చేసిన అధికారులను బుధవారం ఎస్పీ నారాయణరెడ్డి తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నిందితుడికి జీవిత ఖైదు పడేలా పనిచేసిన అడిషనల్ పీపీ మెరాజ్ ఫిర్దౌస్, ప్రస్తుత దౌల్తాబాద్ ఎస్‌హెచ్‌ఓ రవిగౌడ్, భరోసా ఇన్‌చార్జ్ శైలజ, సీడీఓ సురేష్‌గౌడ్, ఏడీజే కోర్టు లైజన్ ఆఫీసర్ నిరంజన్‌గౌడ్, బ్రీఫింగ్ అధికారి కీర్తిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు కలిసి పని చేయడం వల్ల నేరం చేసిన వ్యక్తి శిక్ష పడిందన్నారు. ఇక ముందు కూడా ఇలాగే సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళలు, బాలికల జోలికి వెళితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
● ఎస్పీ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment