మొయినాబాద్: మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయొద్దని ఆయా గ్రామాల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌కు విన్నవించారు. ఈ మేరకు బుధవారం వారిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. మండలంలోని అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, ఎనికేపల్లి, చిలుకూరు, పెద్దమంగళారం, మొయినాబాద్, సురంగల్, ముర్తూజగూడ గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా చేస్తున్నట్లు ప్రతిపాదించారని.. పూర్తిగా గ్రామీణ ప్రాంతంగా ఉన్న పంచాయతీలను మున్సిపాలిటీగా చేయడంతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.111 జీఓ అమలులో ఉన్న ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా చేయొద్దని కోరారు. వినతిపత్రాలు అందజేసినవారిలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు గరుగు రాజు, అశోక్‌యాదవ్, జకరయ్య, రాములు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment