దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేసుకోండి

Published Thu, Jan 9 2025 6:54 AM | Last Updated on Thu, Jan 9 2025 6:54 AM

-

గురుకులాల్లో

ప్రవేశాలకు

అనంతగిరి: ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు టీజిసెట్‌.సీజీజీ.జిఓవి.ఇన్‌లో ఫిబ్రవరి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ నంబరు, బర్త్‌ సర్టిఫికెట్‌, ఫొటో జత చేయాలని పేర్కొన్నారు. పై ధ్రువీకరణ పత్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుందన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లలో ప్రవేశాల కోసం, గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో 9వ తరగతిలో ప్రవేశాల కోసం, ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకులం, పరిగిలో ఎస్‌ఓఈలలో 8వ తరగతిలో ప్రవేశాలకు, అలుగునూరులోని సి.ఓ.ఈలో 9వ తరగతిలో అడ్మిషన్ల కోసం, రుక్మాపూర్‌ సైనిక్‌ స్కూల్‌, మల్కాజ్‌ గిరి ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement