No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, May 6 2024 4:25 AM

No He

మర్రిపాలెం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చే వారే కానీ లాక్కునేవారు కాదని.. భూ హక్కు చట్టంపై అపోహలు వద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బిర్లా జంక్షన్‌లోని బొత్స స్క్వేర్‌లో వైఎస్సార్‌ సీపీ నాయకుడు జి.వి.రవిరాజు ఆధ్వర్యంలో ఆదివారం బిల్డర్స్‌ అండ్‌ కాంట్రాక్టర్స్‌తో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ఉంటుందన్నారు. బ్రిటిష్‌ కాలంలో భూ సర్వేలు జరిగాయని.. అయితే భూముల సబ్‌ డివిజన్‌ జరగలేదన్నారు. దీని వలన క్రయవిక్రయాలు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. వీటిని అధిగమించేందుకు ఈ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. కె.కె.రాజు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం సాకారం చేశారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కె.కె.రాజుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బిల్డర్స్‌ అండ్‌ కాంట్రాక్టర్స్‌ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, వీఎంఆర్డీఏ చైర్మన్‌ సనపల చంద్రమౌళి, కార్పొరేటర్‌ బర్కత్‌ అలీ, కేవీ బాబా, ఇంటక్‌ నాయకులు మంత్రి రాజశేఖర్‌, గుజ్జు వెంకటరెడ్డి, లంక భాస్కర్‌, చంద్రమౌళి పాల్గొన్నారు.

No Headline
1/2

No Headline

No Headline
2/2

No Headline

Advertisement
Advertisement