కాలుష్య నియంత్రణ చర్యలపై ఆరా
మధురవాడ: పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ, దాని కోసం చేపడుతున్న చర్యలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య ఆరా తీశారు. బుధవారం మధురవాడ జోన్–2 పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఆకస్మింగా సందర్శించారు. ఈ సందర్భంగా జిందాల్ వేస్టే మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లో యాజమాన్య ప్రతినిధులు, జీవీఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. డంపింగ్ యార్డులోని జిందాల్‌తో పాటు ఇతర సంస్థలు కాలుష్య నివారణకు చేపడుతున్న చర్యలు, వ్యర్థాలు ఎక్కడ నుంచి ఏయే పద్ధతుల ద్వారా తీసుకువస్తున్నారు తదితర అంశాలపై ఆరా తీశారు. అక్కడ దుర్వాసన వెలువడుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షం నీరు నిల్వ ఉండడం వల్ల దుర్వాసన వస్తోందని అధికారులు చెప్పగా ఇటువంటి కారణాలు చెప్పవద్దన్నారు. జిందాల్ ప్లాంట్‌లో మొక్క నాటారు. అనంతరం మరిడి ఎకోని సందర్శించారు. ఇక్కడకు ఏ రకమైన వ్యర్థాలు, ఎక్కడ నుంచి తెస్తున్నారు. నిల్వ ఉంచే పద్ధతులు, ఉత్పత్తి చర్యల్లో ఎంత మంది కార్మికులను ఉపయోగిస్తున్నారు. వారికి కల్పిస్తున్న రక్షణ చర్యలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సదరు ప్రతినిధులు మాట్లాడుతూ తాము 650 ఆస్పత్రులు, క్లినిక్‌లు, ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలు తీసుకుంటున్నామని, కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యర్ధాలు సక్రమంగా ప్రాసెస్ చేయడం లేదని చెప్పారు. కార్యక్రమంలో జీవీఎంసీ చీఫ్ హెల్త్ ఆఫీసర్ నరేష్, ఈఈ దిలీప్‌కుమార్, ఎస్‌ఈ గోవిందరాజులు, జెడ్సీ సింహాచలం, ఏపీపీసీబీ డీఈ రమేష్ పాల్గొన్నారు.
జిందాల్, మరిడి ప్లాంట్‌లు సందర్శించిన ఏపీీపీసీబీ చైర్మన్ కృష్ణయ్య
Comments
Please login to add a commentAdd a comment