సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ రెండో తేదీన జిల్లాలో పర్యటిస్తారని, ఇందుకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఒకటో తేదీన సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన ముగించుకుని రెండో తేదీ ఉదయం ఎస్.కోట ప్రాంతంలో పర్యటిస్తారన్నా రు. మధ్యాహ్నం విశాఖ కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతలు, పారిశుధ్య చర్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు. ముఖ్యమంత్రి ప్రయాణించే దారిలో రోడ్లపై బ్యానర్లు, విద్యుత్ తీగలు, పోస్టర్లు తొలగించాలన్నారు. సీఎం పర్యటనకు సంబంధించి పర్యవేక్షణ అధికారిగా జేసీ వ్యవహరిస్తారన్నారు. జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్, జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు సంగీత్ మాధుర్, పి.శ్రీలేఖ పాల్గొన్నారు.
100 రోజుల ప్రణాళికపై సమీక్ష
ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రాజెక్టులు, 100 రోజుల ప్రణాళిక తదితర అంశాలపై సమీక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, 100 రోజుల ప్రణాళికలో చోటు కల్పించిన అంశాలు, ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment