● పెన్సిల్ మొనపై ప్రమిద
పెన్సిల్ మొనపై ప్రమిద రూపాన్ని చెక్కి అబ్బురపరిచాడు పెదగంట్యాడకు చెందిన ఓ యువకుడు. జీవీఎంసీ 73వ వార్డు వుడా కాలనీకి చెందిన సయ్యక్ బషీర్ బాబా బి.టెక్ చదువుతున్నాడు. సిద్ధేశ్వరానికి చెందిన అతని స్నేహితుడు ద్వారపూడి మధు సుద్ధముక్కలు, పెన్సిల్, బియ్యపు గింజలపై వివిధ రకాల ఆకృతులను రూపొందించాడు. వాటిపై ఆసక్తి పెంచుకున్న బషీర్ బాబా ఖాళీ సమయంలో స్నేహితుడి వద్ద ఈ కళలో మెలకువలు నేర్చుకున్నాడు. స్నేహితుడి తండ్రి కార్పెంటర్. ఆయనకు చెందిన పనిముట్లతో దీపావళి నేపథ్యంలో ప్రమిదను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. – పెదగంట్యాడ
Comments
Please login to add a commentAdd a comment