దీపావళి.. వెలుగులు నింపాలి
విశాఖ సిటీ: ప్రజలందరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో దీపావళి పండగను జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన పలు బాణసంచా దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాలను బుధవారం ఆయన పరిశీలించారు. స్టాళ్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తగిన భద్రత చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
జాగ్రత్తగా టపాసులు కాల్చాలి : ఈ దీపావళి నగర ప్రజల జీవితాల్లో కాంతులు నింపాలని సీపీ ఆకాంక్షించారు. సరైన జాగ్రత్తలు పాటిస్తూ బాణసంచా కాల్చాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. చిన్న పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్ద వాళ్ల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కాటన్ దుస్తులు ధరించాలన్నారు. ఇంటి లోపల బాణసంచా కాల్చకూడదని, టపాకాయలు చేతిలో పట్టుకుని కాల్చవద్దన్నారు. రోడ్లపై వెళ్లే వాహనచోదకులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా బాణసంచా సామగ్రి కాల్చాలన్నారు.
సీపీ శంఖబ్రత బాగ్చి
Comments
Please login to add a commentAdd a comment