గ్రోత్ హబ్‌గా విశాఖ
గాజువాక : ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో విశాఖ మహానగరాన్ని గ్రోత్ హబ్‌గా తీర్చి దిద్దుతామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం–2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం గాజువాకలోని కణితి మార్కెట్ రోడ్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో కలిసి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరం అభివృద్ధికి నీతి అయోగ్ సహాయంతో ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు రూపొందించామన్నారు. అనంతరం గాజువాక సమస్యలను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్టీల్‌ప్లాంట్ విషయంలోను సానుకూలంగా ఉన్నామని, దానిలో భాగంగానే రెండవ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. జేసీ కె.మయూర్ అశోక్, డీఎస్‌వో భాస్కరరావు, పలువురు స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment