కిశోర బాలికల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
మహారాణిపేట: కిశోర బాలికల ఆరోగ్యం, చదువుపై అధికారులు శ్రద్ధ వహించాలని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కిశోరి వికాసంపై జిల్లా స్థాయి శిక్షణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ ఉన్నత స్థానాలకు చేరుకునేలా తర్ఫీదు ఇవ్వాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని సూచించారు. క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని, వైద్య పరమైన సేవలందించాలన్నారు. జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.జయదేవి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ ఎం.ఆర్.ఎల్.రాధ, జిల్లా బాలల సంరక్షణ అధికారి లక్ష్మి, మహిళా పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.మల్లీశ్వరి, ఆనందపురం ఎంపీడీవో జానకి, జీసీడీవో కలీషా బేగం, జిల్లా ఒకేషనల్ అధికారి రాధ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సమత, జిల్లా ఇమ్యూనేజిషన్ అధికారి డాక్టర్ జీవన్ రాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment