పేదల బియ్యం తరలిస్తే క్రిమినల్ కేసులు
సాక్షి, విశాఖపట్నం : పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, అనధికారిక గోదాముల్లో నిల్వలుంచినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ హెచ్చరించారు. రేషన్ బియ్యం మాఫియాపై ‘సాక్షి’లో ‘కూటమి చేతుల్లో పరేషన్’ శీర్షికపై ప్రచురించిన కథనంపై జేసీ స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇకపై కఠినంగా వ్యవహరించనున్నామంటూ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు స్టాక్ రికార్డులను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా మని ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్ నెలలో 6ఏ కేసులు 19 నమోదు చేసి 160 క్వింటాళ్ల బియ్యంతో పాటు 8 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా.. నవంబర్‌లో ఇప్పటి వరకూ 6ఏ కేసులు 37 నమోదు చేయగా.. 450 క్వింటాళ్ల బియ్యం, 5 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణాపై ఈ కింది నంబర్లకు ప్రజలు ఫిర్యాదులు చెయ్యవచ్చన్నారు.
సర్కిల్–1 సహాయ సరఫరా అధికారి
9704092496
సర్కిల్–2 సహాయ సరఫరా అధికారి
8897488368
సర్కిల్–3 సహాయ సరఫరా అధికారి
8008308282
భీమిలి డిప్యూటీ తహశీల్దార్
9866060835
పెందుర్తి డిప్యూటీ తహశీల్దార్
8247845510
జాయింట్ కలెక్టర్
మయూర్ అశోక్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment