అక్షయపాత్ర సందర్శన
ప్రతి కోచ్‌లోనూ నిపుణులతో చర్చలు
ఈ యాత్ర జాగృతి సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో 17 ఏళ్లుగా కొనసాగుతోంది. వ్యవస్థాపకుడిగా శశాంక్ మణి వ్యవహరిస్తున్నారు. ఎంటర్‌ప్రైజెస్ ద్వారా భారతదేశాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో యాత్రను నిర్వహిస్తున్నారు. మొత్తం 150 మంది నిపుణులు.. ట్రైన్‌లో ప్రయాణించే వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేలా జీవిత పాఠాలు బోధిస్తారు. తరగతిగదిలో నేర్చుకున్న దానికీ, బయట పరిశ్రమల అవసరాలకు మధ్య పెరుగుతున్న అంతరం తగ్గించేలా.. ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా.. రైలు దిగేలోపు జీవితంలో ఏదో ఒకటి సాధిస్తామన్న విశ్వాసాన్ని కల్పిస్తారు. అంతేకాకుండా ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చైన్నె మొదలైన మెట్రో నగరాల్లో దిగ్గజాలతో ఇంటరాక్షన్ సెషన్స్ కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ 17 ఏళ్ల రైలు ప్రయాణంలో 28 శాతం మంది పారిశ్రామికవేత్తలుగానూ, 62 శాతం మంది ఉద్యోగాల్లోనూ మిగిలిన వారు సామాజిక సేవలో స్థిరపడ్డారు.
తగరపువలస: అక్షయపాత్ర ఫౌండేషన్ అపరిమిత ఆహారంతో అపారమైన విద్యను అందిస్తుందని అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస తెలిపారు. శుక్రవారం సాయంత్రం జాగృతి సేవాసంస్థ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన పారిశ్రామిక రంగంలో ఆసక్తి కలిగిన 525 మంది యువతీయువకులు ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని అక్షయపాత్ర వంటశాలను అధ్యయనం చేయడానికి వచ్చా రు. వీరిని ఉద్దేశించి సత్యగౌర చంద్రదాస ప్రసంగించారు. తమ ఫౌండేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులకు 75 వంట శాలల ద్వారా ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో 24 ఏళ్లుగా నిత్యం మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నామన్నారు. ఫౌండేషన్ విశాఖ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస ఆధ్వర్యంలో జాగృతి యాత్ర వరుసగా 9వసారి అక్షయపాత్ర ఫౌండేషన్‌ను సందర్శించినట్టు గుర్తు చేశారు.
ఉపాధి అవకాశాలు
పారిశ్రామికవేత్తలను తయారు చేసి గ్రామీణులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాగృతి యాత్ర లక్ష్యం. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ సొంతంగా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసి లాభదాయక ఉత్పత్తులు ఎగుమతి చేసేలా సిద్ధం చేస్తాం. అందులో భాగంగా గంభీరంలోని అక్షయపాత్ర వంటశాలను సందర్శించాం.
– శేషగిరి, ట్రస్ట్ సభ్యుడు, జాగృతి సేవాసంస్థ, ఉత్తరప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment