విహార యువగీతిక
విజ్ఞాన వీచిక
● తమ గురించి తాము తెలుసుకునే రైలు ప్రయాణం ● విశాఖ చేరుకున్న జాగృతియాత్ర ● 15 రోజులపాటు 8 వేల కిమీ సాగనున్న స్పెషల్ ట్రైన్
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి/తగరపువలస : సాధారణంగా చూసేందుకు
అది రైలే. కానీ మరింత పరికించి చూస్తే అదో కదిలే విశ్వవిద్యాలయం. ప్రతి బోగీ ఒక తరగతి గది. ఆలోచనలకు పదునుపెట్టాలన్నా.. వాటి నుంచి అద్భుతాలను ఆవిష్కరించాలనే కాంక్ష యువతరంలో బలంగా నాటుకోవాలన్నా.. విజ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంపొందించాలన్నా..ఆ రైలులో కూర్చుంటే చాలు. జీవితానికి సరిపడా జ్ఞానాన్ని ఆ ప్రయాణంలోనే
సముపార్జించుకోవచ్చు. ఆ ప్రయాణం పేరే జాగృతి యాత్ర. కేవలం నడిచేది 15 రోజులే
అయినా జీవితాంతం తప్పటడుగులు వెయ్యకుండా నడిచేంత ధైర్యాన్ని
నూరిపోస్తుందీ యాత్ర. తమను తాము తెలుసుకునేందుకు ముంబైలో బయలుదేరిన జాగృతి యాత్ర రైలు శుక్రవారం విశాఖ చేరుకుంది.
మళ్లీ వస్తా..
బీటెక్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాను. జాగృతియాత్ర బిజినెస్ టూర్‌లా సాగుతోంది. ఎక్కడైనా అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. వాటిని ఎలా వినియోగించుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నారు. సామాజికసేవలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.
– దీప్తి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment