మాఫియా దందా! | - | Sakshi
Sakshi News home page

మాఫియా దందా!

Published Sat, Nov 23 2024 1:25 AM | Last Updated on Sat, Nov 23 2024 1:25 AM

మాఫియ

మాఫియా దందా!

మద్యం షాపుల్లో
● స్థలం కావాలంటే 50 శాతం వాటా ● ఒడిశా మద్యం వ్యాపారికి చుక్కలు ● చివరకు వాటా ఇచ్చిన తర్వాతే స్థలం కేటాయింపు ● తెరవెనుక చక్రం తిప్పుతున్న జనసేన ఎమ్మెల్యే ● షాపు పెట్టుకుంటే రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే ● మరో కూటమి ఎమ్మెల్యే కలెక్షన్‌

ప్రైవేటు మద్యం షాపులకు కొత్త ప్రభుత్వం తెరలేపిన వెంటనే కూటమి ఎమ్మెల్యేలు కలెక్షన్లకు దిగారు. భారీగా అమ్మకాలుండే ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు కోసం ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి బ్లాక్‌ చేసి పెట్టుకున్నారు. లాటరీలో షాపు దక్కించుకున్న వారు అక్కడ షాపు ఏర్పాటు చేయాలంటే తమకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనంటూ కూటమి ఎమ్మెల్యే అండదండలతో కొద్ది మంది మద్యం సిండికేట్లు పట్టుబడుతున్నారు. ఈ విధంగా ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారికి దక్కిన మూడు షాపుల్లోనూ జనసేన ఎమ్మెల్యే అండదండలున్న మద్యం సిండికేట్‌ ముఖ్యుడు 50 శాతం వాటా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వ్యాపారం జరిగే ప్రాంతాల్లో అప్పటికే ఏర్పాటైన షాపులకు సమీపంలోనే మరో షాపును సదరు మద్యం మాఫియా ఏర్పాటు చేస్తోంది. తద్వారా వారి వ్యాపారానికి గండికొడుతున్నారు. ఇక చేసేదేమీ లేక తమ షాపులో వాటాను కూడా ఈ మద్యం మాఫియాకు అప్పగించే పరిస్థితిని కల్పిస్తున్నారు.

– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

రోవైపు కూటమి ఎమ్మెల్యే ఒకరు తన ప్రాంతంలో షాపు ఏర్పాటు చేసుకుంటే రూ.10 లక్షల చొప్పున మామూళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విధంగా ముట్టచెప్పిన తర్వాతే షాపు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. మొత్తంగా ప్రైవేటు మద్యం వ్యాపారంలో కూటమి ఎమ్మెల్యేలు వాటాలు, కోటాలతో జేబులు నింపుకుంటున్నారు. మరోవైపు మద్యం సిండికేట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తికి చెందిన షాపులకే ఎక్కువగా మంజీరా, కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్ల మద్యం సరఫరా జరిగే విధంగా మద్యం డిపో అధికారితో వ్యవహారాలు నడుపుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వసూళ్లలో కొత్త పంథా...!

ద్యం వ్యాపారంతో గతంలో లావాదేవీలు లేని ఓ కూటమి ఎమ్మెల్యే వసూళ్ల కోసం కొత్త పంథా అనుసరిస్తున్నాడు. తన నియోజకవర్గంలో ఎవరు షాపు ఏర్పాటు చేసినా..తనకు రూ. 10 లక్షలు ముట్టచెప్పాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఈ విధంగా అందరి వద్ద ఆయన వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే వసూలు చేసిన తర్వాత షాపు ఏర్పాటుకు ఏవైనా అడ్డంకులు వచ్చినా ఆయన మాత్రం కనీసం స్పందించడం లేదని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. వాస్తవానికి 20 శాతం మార్జిన్‌ అని మొదట్లో ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత మాటమార్చి 14 శాతానికి తగ్గించిందంటూ మండిపడుతున్నారు. తద్వారా కోట్లు ఖర్చు పెట్టి దక్కించుకున్న కొద్ది షాపులకు కూడా కూటమి ఎమ్మెల్యే అండదలతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా ఇబ్బందులు పెడుతోందని వాపోతున్నారు. మరోవైపు మద్యం డిపోకు వచ్చిన స్టాకును అన్ని షాపులకూ సమానంగా పంపిణీ చేయాల్సిన అధికారి కాస్తా.. కేవలం మద్యం సిండికేట్‌ను శాసిస్తున్న వారికి చెందిన కొద్ది షాపులకే మంజీరా బ్రాండ్‌, కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్లను అధికంగా పంపిణీ చేస్తున్నారని మండిపడుతున్నారు. సదరు అధికారిపై గతంలో అనేక ఆరోపణలున్నప్పటికీ కీలకమైన మద్యం డిపో మేనేజర్‌గా కూటమి ప్రభుత్వం నియమించడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి.

పోటీ షాపులతో..

తంలో వార్డుల వారీగా షాపుల ఏర్పాటుకు లాటరీ నిర్వహించేవారు. అయితే ఈ దఫాలో మాత్రం స్టేషన్ల వారీగా లాటరీలో షాపులను కేటాయించారు. దీనిని కూడా ఈ ప్రైవేటు మద్యం మాఫియా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఒక స్టేషన్‌ పరిధిలో తమకు వచ్చిన షాపులను ఏర్పాటు చేయకుండా ఆ ప్రాంతంలో అప్పటికే షాపులు ఏర్పాటైన చోట్ల ఎంత మేర వ్యాపారం జరుగుతుందో ఆరా తీస్తున్నారు. బాగా వ్యాపారం జరిగే షాపులకు సమీపంలోనే వీరు వెళ్లి తమ షాపులను తెరుస్తున్నారు. ఈ విధంగా గాజువాక, పెందుర్తి, పెదవాల్తేరు సర్కిల్‌ ప్రాంతాల్లో బాగా వ్యాపారం జరిగే షాపులకు సమీపంలోనే ఏర్పాటు చేసి..వారి వ్యాపారాన్ని దెబ్బతీసినట్టు తెలుస్తోంది. ఇక మరో ప్రాంతంలో ఎమ్మెల్యేకు రూ. 10 లక్షలు ముట్టచెప్పిన తర్వాత ఆయన అండదండలతో ఆయన చెప్పిన స్థలంలోనే షెడ్డును నిర్మించారు. అయితే మద్యం మాఫియా కాస్తా జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి అనధికారి నిర్మాణం పేరుతో షాపును తొలగించారు. తద్వారా మొత్తంగా రూ. 14 లక్షల మేర నష్టపోయినట్టు సదరు వ్యాపారి వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇక చేసేదేమీ లేక మద్యం సిండికేట్‌కు దాసోహం అయినట్టు ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
మాఫియా దందా!1
1/2

మాఫియా దందా!

మాఫియా దందా!2
2/2

మాఫియా దందా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement