ఏయూలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం వేదికగా వీసీ ఆచార్య శశిభూషణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 మీటర్లు, 5000 మీటర్ల పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు వీసీ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. క్రీడల్లో ఉన్నతంగా రాణించి, ఏయూకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఏయూ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఆచార్య ఎన్.విజయమోహన్ మాట్లాడుతూ 44 ఈవెంట్లలో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 33 కళాశాలలకు చెందిన 620 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో హోరాహోరీగా తలపడ్డారు. 100 మీటర్లు, లాంగ్ జంప్, జావెలిన్ త్రో క్రీడలు ఉత్కంఠ భరితంగా సాగాయి. వర్సిటీ అనుబంధ కళాశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, రీసెర్చ్ స్కాలర్స్, ఎంపీఈడీ విద్యార్థులు పాల్గొన్నారు.
33 కళాశాలల నుంచి 620 మంది క్రీడాకారులు రాక
Comments
Please login to add a commentAdd a comment