విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయం

Published Sun, Nov 24 2024 4:00 PM | Last Updated on Sun, Nov 24 2024 4:00 PM

విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయం

విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయం

విశాఖ లీగల్‌: న్యాయవాదిగా విజయలక్ష్మి సేవలు ప్రశంసనీయమని గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ అన్నారు. శనివారం జిల్లా కోర్టులోని నూతన భవనం న్యాయవాదుల సంఘం ఆవరణలో దివంగత ఎన్వీఆర్‌ విజయలక్ష్మి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదిగా విజయలక్ష్మి ఎన్నో పదవులు అధిరోహించడంతోపాటు న్యాయస్థానంలో తన ప్రతిభతో ఎన్నో కేసుల్లో విజయం సాధించారన్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవనంద్‌ మాట్లాడుతూ విజయలక్ష్మితో సహచర న్యాయవాదిగా తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఎంకే సీతారామయ్య కార్యాలయంలో జూనియర్‌గా ఆమె ఎంతో శ్రమించారన్నారు. ఢిల్లీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ రోహిణి మాట్లాడుతూ న్యాయవాదిగా విజయలక్ష్మి సేవలను కొనియాడారు. విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బేవరా సత్యనారాయణ, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, సీనియర్‌ న్యాయవాది లక్ష్మీ రాంబాబు, ఎంకే శ్రీనివాస్‌ ప్రసంగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement