రెవెన్యూ సదస్సులో టీడీపీ నేతల బెదిరింపులు
అక్కిరెడ్డిపాలెం: గాజువాక జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుల్ని టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తూ, అవమానించారు. స్థానిక సమస్యలపై నివేదించే అవకాశం ఇవ్వకుండా నువ్వెవడివిరా అంటూ మాట్లాడేందుకు వీల్లేకుండా వ్యవహరించారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవో నెం.301ను మళ్లీ అందుబాటులోకి తెచ్చి గాజువాక భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ సదస్సులు వచ్చే నెల 8 వరకు జరుగుతాయని, రెవెన్యూ సమస్యలను సదస్సు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సదస్సులో మాట్లాడేందుకు డీసీఎంఎస్ మాజీ చైర్‌పర్సన్ పల్లా చినతల్లి భర్త, వైఎస్సార్‌సీపీ నాయకుడు పల్లా వెంకటరావు ప్రయత్నించారు. స్టేజ్‌పైనే ఉన్న టీడీపీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు కలుగుజేసుకుని నువ్వెవడివిరా మాట్లాడేందుకు.. ఇది మా ప్రభుత్వం అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో సదస్సులో కాసేపు గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే కలుగుజేసుకుని సదస్సులో ఉన్న సీఐ పార్ధసారథితో మాట్లాడి, గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన సదస్సుల్లో కూడా పెంటారావు ఇబ్బందికరంగా వ్యవహరించాడని, స్టేషన్‌ను తీసుకుపోండని చెప్పడంతో పోలీసులు స్టేషన్‌కు తరలించారు. రాత్రి వరకు స్టేషన్లో ఉంచి బైండోవర్ చేసి, వదిలిపెట్టారు. తన భర్తను విడుదల చేయాలని చినతల్లి కోరినా.. ఎమ్మెల్యే చెప్తేనే వదులుతామంటూ.. తన భర్త వద్దనున్న సెల్‌ఫోన్‌ను సైతం తీసుకున్నారని ఆమె వాపోయింది. సదస్సులో కార్పొరేటర్లు ఉరుకూటి చందు, బొడ్డు నర్సింహపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నేత పల్లా పెంటారావును బెదిరించిన టీడీపీ కార్పొరేటర్‌పల్లా శ్రీనివాసరావు
పోలీస్ స్టేషన్‌కు తరలించి, బైండోవర్
Comments
Please login to add a commentAdd a comment