భారం.. ఘోరం
నగర పరిసర ప్రాంతాల్లో పెరిగే భూముల విలువ 20 %శివారు ప్రాంతాల్లో 25-50 % పీఎంపాలెం, మధురవాడ, గాజువాక ప్రాంతాల్లో 25-35 % కాపులుప్పాడ, పెందుర్తి, భీమిలి ప్రాంతాలు 50 %
మధ్య తరగతి సొంతింటి కలను
చెరిపేయడానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధ
మవుతోంది. తిరోగమనంలో ఉన్న స్థిరాస్తి
రంగంపై పిడుగు వేయనుంది. ఈ నెలలో
విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులకు
షాకిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. వచ్చే కొత్త
సంవత్సరం కానుకగా రిజిస్ట్రేషన్ల చార్జీలు
పెంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విశాఖలో
భూముల విలువ సవరణకు సంబంధించిన
కసరత్తు పూర్తయింది. జిల్లాలో 20 నుంచి 50
శాతం మేర చార్జీలు పెంచాలని నిర్ణయించిం
ది. దీంతో ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, వెంచర్లలో
స్థలాలతో పాటు వ్యవసాయ భూములు
కొనుగోలు చేసే వారిపై జనవరి 1వ తేదీ
నుంచి మోయలేని భారం పడనుంది.
● కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1 నుంచి పెంచిన చార్జీలు అమలు
● జిల్లాలో 20 నుంచి 50 శాతం మేర భూముల విలువ పెంపు
● పూర్తయిన కసరత్తు ఉన్నతాధికారుల నుంచి ఆమోదం
● తిరోగమనంలో స్థిరాస్తి రంగం
విశాఖ సిటీ: కొత్త ఏడాది నుంచి జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. ప్రాంతాన్ని బట్టి 20 నుంచి 50 శాతం చార్జీల పెంపునకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మూడు నెలలుగా మార్కెట్ విలువలను సవరించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉన్న 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, జీవీఎంసీ జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల ద్వారా భూముల ధరల సమాచారాన్ని సేకరించారు. వాటిని క్రోడీకరించి ఎంత మేర సవరించాలన్న విషయంపై తుది అంచనాలు తయారు చేశారు. ఆ సవరణల జాబితాకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం నగర పరిసర ప్రాంతాల్లో 20 శాతం మేర, శివారు ప్రాంతాల్లో 25 నుంచి 50 శాతం వరకు పెరగనుంది. ఇళ్లు, ప్లాట్లతో పాటు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా భారీగా పెరగనున్నాయి. పీఎంపాలెం, మధురవాడ, గాజువాక ప్రాంతాల్లో 25 నుంచి 35 శాతం, కాపులుప్పాడ, పెందుర్తి, భీమిలిలో కొన్ని ప్రాంతాల్లో 50 శాతం మేర చార్జీలు అధికం కానున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో మాత్రం పెద్దగా వ్యత్యాసం ఉండే అవకాశం లేదు. అయితే మధురవాడ, మిథిలాపురి కాలనీ, కాపులుప్పాడ, బోయపాలెం, పెందుర్తి, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో ఫ్లాట్ల చార్జీలు భారం కానున్నాయి. అపార్ట్‌మెంట్లకు భూమి విలువతో పాటు చదరపు అడుగుల్లో నిర్మాణ విలువను కూడా లెక్కిస్తున్నారు. ఈ విధానంలో ఫ్లాట్ల ధరలకు రెక్కలు రానున్నాయి. అలాగే భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విలువ భారీగా పెరగనుంది.
నేటి నుంచి కొత్త ధరల ప్రదర్శన
భూముల విలువల సవరణ ప్రతిపాదనలకు జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. శుక్రవారం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో కొత్త ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 24వ వరకు అభ్యంతరాలు/సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల పరిశీలన ఈ నెల 26వ తేదీ వరకు జరగనుంది. తుది చార్జీల జాబితాకు 27న మార్కెట్ విలువ సవరణ కమిటీ ఆమోద ముద్ర వేయనుంది. 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment