● భక్త తీర్థం
కుంకుమ పూజలో మహిళా భక్తులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేశారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించి తరువాత శ్రీరామచంద్రస్వామిని ప్రత్యేకంగా అలంకరించి కల్యాణ మంటపంలో వేంచేపుజేశారు. మంటపంపై అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తికి పుష్పార్చన, మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన జరిపించారు. స్వామికి సుందరకాండ పారాయణం, పట్టాభిషేకమహోత్సవాలను చేపట్టారు. మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరిపించి గాజులతో విశేషంగా అలంకరించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఈఓ వై శ్రీనివాసరావు, టీడీపీ మండల నాయకులు సువ్వాడ రవిశేఖర్, లెంక అప్పలనాయుడు, ఆల్తి శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment