ఆశ్రమ పాఠశాలల్లో... మృత్యు ఘంటికలు! | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలల్లో... మృత్యు ఘంటికలు!

Published Thu, Nov 7 2024 12:44 AM | Last Updated on Thu, Nov 7 2024 12:44 AM

ఆశ్రమ పాఠశాలల్లో... మృత్యు ఘంటికలు!

ఆశ్రమ పాఠశాలల్లో... మృత్యు ఘంటికలు!

సాక్షి, పార్వతీపురం మన్యం: ఆశ్రమ పాఠశాలల్లో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు, వివిధ ఆరోగ్య సమస్యలతో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. పిల్లల మరణాలు ఆగడం లేదు. ఈ ఏడాది కాలంలోనే ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. ఫలితంగా తమ బిడ్డల్లోనే భవిష్యత్తును చూసుకుంటున్న తల్లిదండ్రులకు కడుపుశోకం మిగులుతోంది.

మంత్రిగారూ.. కాస్త దయ చూపరూ!

జిల్లాలోని సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గుమ్మిడి సంధ్యారాణి.. రాష్ట్ర మహిళాశిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా బాధ్యత లు చేపట్టగానే మొదటి సంతకం ఆశ్రమ పాఠశాల ల్లో ఏఎన్‌ఎంల నియామకంపైనే ఆమె చేశారు. ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. ఆశ్రమ పాఠశాలల చిన్నారులు ఒక్కొక్కరుగా ప్రాణాలు వదులుతున్నా.. వాటిపై పర్యవేక్షణ పెంచడం, సమస్యలను పరిష్కరించడం వంటి చర్యలు కానరావడం లేదు. కొద్ది నెలలుగా జిల్లాలో సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు విజృంభిస్తున్నాయి. నివారణకు పక్కా ప్రణాళిక లోపిస్తోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు మరణిస్తున్నా మంత్రిలో చలనం కనిపించడంలేదని విమర్శిస్తున్నాయి.

పాపం.. చిన్నారులు

ఈ ఏడాది జులై 6న జియ్యమ్మవలస మండలానికి చెందిన రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బి.ఈశ్వరరావు మృతి చెందాడు. అదే నెల 22న పార్వతీపురం మండలంలోని రావికోన ఆశ్రమ పాఠశాలకు చెందిన పి.రాఘవ అనే ఆరో తరగతి విద్యార్థి సెరిబ్రల్‌ మలేరియాతో కన్ను మూశాడు. గుమ్మలక్ష్మీపురం మండలం వంగరకు చెందిన నాలుగో తరగతి విద్యార్థి ఎం.గౌతమ్‌ మలేరియాతో ప్రాణాలు వదిలాడు. కొమరాడ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కడ్రక శారద, గుమ్మలక్ష్మీపు రం మండలం పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతు న్న నిమ్మల అవంతి డెంగీతో ప్రాణాలు వదిలారు. తాజాగా మంగళవారం కురుపాంలో ఓ విద్యార్థి మరణించగా.. బుధవారం జియ్యమ్మవలస మండ లం రావాడ రామభద్రపురం గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఏడో తరగతి విద్యార్థి నిమ్మక జీవన్‌ కన్నుమూశాడు. ఇవి కేవలం ఆశ్రమ పాఠశాలల్లో వెలు గు చూసిన ఘటనలే. వీటి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. నిత్యం జిల్లాలో గిరిజన విద్యార్థులు మరణిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఆ తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు. కేవలం విద్యార్థులే కాదు.. జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు పెద్దవారినీ కబళించేసిన ఉదంతాలు ఈ ఏడాది అనేకం.

పర్యవేక్షణ కరవు

జిల్లాలో 55 వరకు ఆశ్రమ పాఠశాలలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఐటీడీఏలకు రెగ్యులర్‌ పీవోలు ఉండడం లేదు. అధికారుల కొరత.. సరిపడా నిధులు మంజూరు కాకపోవడం.. వెరసి పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement