ఆత్మీయ కలయిక
విజయనగరం: వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ విజయనగరం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. విజయగనరం జిల్లాలో యువజన విభాగాన్ని పటిష్టం చేసి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్టు బంగారునాయుడు తెలిపారు.
8న ధ్రువపత్రాల పరిశీలన
విజయనగరం ఫోర్ట్: డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డీఎంఎస్‌టీ, డీఓఏ, డీఏఎన్‌ఏ పారామెడికల్ కోర్సులకు ఈ నెల 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌ను ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు. ఎంపికై న అభ్యర్థులు
వెంటనే రూ.7,700 చెల్లించాలన్నారు.
ఆరోగ్య పరిరక్షణపై అవగాహన
విజయనగరం అర్బన్: ఆరోగ్య పరిరక్షణపై గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లతో కలెక్టర్ తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైద్యారోగ్యం, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గుర్లలో వలే డయేరియా కేసులు ఎక్కడైనా నమోదైతే సంబంధిత సిబ్బందితో పాటు, అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, కాచి చల్లార్చిన నీటిని తాగడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం వంటి ఆరోగ్య సూత్రాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డీపీఓ టి.వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.ఉమాశంకర్, డీఎల్‌ఓ డాక్టర్ రాణి, తదితరులు పాల్గొన్నారు.
రాములోరి ఆభరణాలు తనిఖీ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి అభరణాలను బుధవారం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా దేవదాయశాఖ జేవీఓ(జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి) పల్లం రాజు సమక్షంలో స్వామివారి బంగారు, వెండి వస్తువులను సరి చూశారు. ఆభరణాల బరువును సరిచూసి రికార్డుల్లో పొందు పరిచారు. దేవస్థానానికి దాతలు సమకూర్చిన బంగారు, వెండి ఆభరణాల వివరాలను సేకరించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment