డయేరియా బాధితులకు..ఆపన్నహస్తం
● అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ
● డయేరియా బాధితులకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం
● అందజేసిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
● డయేరియా ప్రబలడానికి ప్రభుత్వ
నిర్లక్ష్యమే కారణం
● శాసన మండలిలో మంత్రులను
ప్రశ్నించినా ఫలితం లేదు
● బాధిత కటుంబాలకు సానుభూతి
తెలిపిన మాజీ సీఎం
వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి
● ఇచ్చిన మాట ప్రకారం సాయం
అందజేత
భరోసా కల్పించారు
డయేరియాతో మా మామయ్య సారిక పెంటయ్య మృతి చెందారు. మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మా కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 2లక్షల ఆర్థిక సహాయం అందించి మా కుటుంబానికి భరోసా కల్పించారు.
– సారిక హైమవతి
ఆదుకున్నారు
డయేరియాతో భార్య తోండ్రంగి రాము మృతి చెందింది. ఆవేదనకు గురయ్యాం. కష్టకాలంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మా కుటుంబాన్ని ఓదార్చారు. గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందజేయాలని ప్రభుత్వానికి కోరారు. ఈ రోజు రూ.2లక్షలు పంపించారు. ఆయన చేసిన సాయం మరచిపోలేనిది.
– తోండ్రంగి అప్పారావు
అండగా ఉన్నారు
డయేరియాతో భర్త చింతపల్లి అప్పారావు మృతి చెందారు. కుటుంబ పెద్ద దిక్కు డయేరియాతో మృతి చెందడంతో ఇబ్బందులు పడుతున్న మా కుటుంబానికి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి రూ. 2లక్షల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఆయనకు కృతజ్ఞతలు.
– చింతపల్లి అప్పయ్యమ్మ
మాట నిలబెట్టుకున్నారు
మాజీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. డయేరియాతో తల్లి పతివాడ సూరమ్మ మృతి చెందింది. మా కుటుంబాన్ని పరామర్శించిన జగన్‌మోహన్ రెడ్డి అండగా ఉంటామని హమీ ఇచ్చారు. రూ.2లక్షల చెక్కును వైఎస్సార్‌సీపీ నేతలు అందజేశారు. – పతివాడ శ్రీనివాసరావు
రుణపడి ఉంటాం
మా లాంటి పేద కుటుంబాలకు అండగా ఉన్న మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మా అత్త బోడశింగి రాములమ్మ డయేరియాతో మృతి చెందింది. జగన్‌మోహన్‌రెడ్డి గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం అందజేసి ఆదుకున్నారు. – బోడశింగి గౌరి
మేలు మరచిపోలేనిది
డయేరియాతో తల్లి కలిశెట్టి సీతమ్మ మృతి చెందింది. ప్రభు త్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించేందుకు వచ్చినా ఎటువంటి భరోసా కల్పించలేదు. పైసా సాయం అందించలేదు. మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి మా కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అందజేశారు. – కలిశెట్టి మోహనరావు
గుర్ల: డయేరియాతో గుర్ల మండల కేంద్రంతో పాటు నాగళ్లవలస, కోటగండ్రేడు గ్రామాల ప్రజలు నెలరోజుల పాటు వణికిపోయారు. 13 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారు. గత నెల 24న బాధితులను పరామర్శించారు. కష్టసుఖాలు తెలుసుకున్నారు. డయేరియా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ.2లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం శాసనమండలి విపక్షనేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక నాయకుల చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు మంగళవారం అందజేశారు. గుర్ల మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గుర్లలో డయేరియా ఘటనపై శాసన మండలిలో ప్రశ్నించినా ఫలితం లేదన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో బహిరంగ మలవిసర్జన వల్లే డయేరియా ప్రబలిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేయడం లేదని, మంత్రులందరూ మేధావులం అన్న భ్రమలో ఉన్నట్టు విమర్శించారు. తన రాజకీయ జీవితంలో డయేరియాతో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమసన్వయలోపం, వైద్యసేవలు అందజేయడంలో జాప్యం వల్లే డయేరియా విజృంభించి ప్రాణాలు తీసిందన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే ఉంటుందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కరోనా కష్టకాలంలో మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. గుర్ల మండలంలోని ఐదు గ్రామాల్లో డయేరియా విజృంభిస్తే వైద్యం అందించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. డయేరియా వల్ల ప్రజలు మృతి చెందినా స్థానిక ఎమ్మెల్యే ఆచూకి లేకుండా పోయిందన్నారు. జిల్లా ఇన్‌చార్జిమంత్రి వచ్చినప్పటికీ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వలేదన్నారు. డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇస్తామన్న రూ.లక్ష సాయం నేటికీ అందజేయలేదన్నారు. ప్రజలకోసం ఎవరు పనిచేస్తున్నారో ఆలోచన చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేసిన వారిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పొట్నూరు సన్యాసినాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు జమ్ము స్వామినాయుడు, బెల్లాన బంగారునాయుడు, వరదా ఈశ్వరరావు, తోట తిరుపతిరావు, కెంగువ మధుసూదనరావు, అంబల్ల చిన్నారావు, ఇజ్జిరోతు ప్రసాద్ ఉన్నారు.
ఎల్లప్పుడూ ప్రజల పక్షమే
బాధిత కుటుంబాలకు జగన్ భరోసా
డయేరియాతో మృతి చెందిన కుటుంబాలకు మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయా కుటుంబాలను పరామర్శించడంతో పాటు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారన్నారు. అయితే, సాయం ప్రకటించిన మూడురోజుల్లోనే చెక్కులు అందజేయాలని నిర్ణయించినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో అందజేయలేకపోయామన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుర్లలో డయేరియాతో మృతి చెందిన 10 కుటుంబాలకు, కోటగండ్రేడు గ్రామానికి చెందిన ఒకరికి మొత్తం 11 మందికి రూ.2లక్షల చొప్పున రూ.22 లక్షలను చెక్కుల రూపంలో అందజేశామన్నారు. నాగళ్లవలసకు చెందిన సత్యం, సీతన్నాయుడు కుటుంబాలకు అందజేయాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment