సాలూరు: మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొరకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాలూరు పట్టణంలోని పి.ఎన్.బొడ్డవలస వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాజన్నదొర తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో సీ్త్ర శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బొడ్డవలస వైపు వెళ్తున్నారు. సింగిల్ రోడ్డు కావడం, మంత్రి కాన్వాయ్ వాహనాలను వేగంగా నడపడంతో బంగారమ్మపేట వద్ద రాజన్నదొర వెళ్తున్న వాహనం మీదకు కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదుపుతప్పి దూసుకొచ్చింది. కాన్వాయ్ రావడాన్ని గమనించిన రాజన్నదొర కారు డ్రైవర్ రవి వాహనాన్ని పూర్తిగా ఎడమవైపుకు తిప్పడంతో మంత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనం రాజన్నదొర కారు సైడ్ మిర్రర్‌ను దూసుకుంటూ వెళ్లిపోయింది. ఓ మాజీ ఉపముఖ్యమంత్రి కారు మిర్రర్‌ను ఢీకొన్నా మంత్రి ఆరా తీయకుండానే ముందుకుసాగిపోవడం గమనార్హం.
అసహనం వ్యక్తంచేసిన రాజన్నదొర
ఈ ఘటనపై రాజన్నదొర మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు, జన సంచారం ఉన్న ప్రదేశాలు, సింగిల్ రోడ్ల వద్ద కాన్వాయ్ నెమ్మదిగా వెళ్లడం మంచిదన్నారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కాన్వాయ్ ప్రజా సంచారం ఉన్న సమయంలో నెమ్మదిగా వెళ్లాలని, పట్టణంలో సైరెన్‌లు వేయవద్దని సూచించేవాడినన్నారు. ఓ మాజీ ఉపముఖ్యమంత్రికు త్రుటిలో ప్రమాదం తప్పినా.. కనీసం ఏమైందని వాకబు చేయకుండా మంత్రి ముందుకు సాగిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సామాన్య ప్రజలకు ఏమైనా జరిగితే పట్టించుకునే వారే ఉండరన్న చర్చసాగింది.
● రాజన్నదొర వాహనంపైకి
దూసుకొచ్చిన మంత్రి సంధ్యారాణి
కాన్వాయ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం
● అప్రమత్తమైన రాజన్నదొర కారు డ్రైవర్
● వాహనాన్ని పక్కకు తీయడంతో
సైడ్ మిర్రర్‌ను ఢీకొన్న వాహనం
● ఏం జరిగిందన్నది పట్టించుకోకుండా
వెళ్లిపోయిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment