ధాన్యం తరలింపుపై జేసీ సమీక్ష
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక అన్నారు. ఈ మేరకు సీతానగరం తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లుపై రైస్ మిల్లర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌లతో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ ఎస్‌ఎస్ శోభిక మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి వీలుగా బీజీలు తప్పనిసరి కావున మిల్లర్లు త్వరగా బీజీలు ఇవ్వాలని కోరారు. అల్పపీడనం ఉన్న కారణంగా ధాన్యం తడవక ముందే కళ్లాల్లో ఉన్న ధాన్యం మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనాల కదలిక, రశీదులు, గన్నీబ్యాగ్‌ల లక్ష్యాల చెల్లింపులకు సంబంధించిన కస్టోడియన్, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ ప్రతినిధి బి.శ్రీరాములునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పి.సత్యంనాయుడు, తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, రైస్‌మిల్లర్లు, జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్ పాల్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ పి.శ్రీనివాసరావు, ఏఓ అవినాష్, సీఎస్‌డీటీ రమేష్‌బాబు, కస్టోడియన్ అధికారులు పాల్గొన్నారు.
గుచ్చిమిలో ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ
మండలంలోని గుచ్చిమి రైతుసేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ స్థానికంగా నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేయాలని మండలవ్యవసాయాధికారి అవినాష్‌ను ఆదేశించారు. రైతు సేవా కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పెదభోగిలి రైతు సేవాకేంద్రాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment