ఆశావాహ బ్లాక్‌లో పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురం: ఆశావాహ బ్లాక్‌గా ఉన్న భామిని మండలంలో మంజూరు చేసిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఆశావాహ బ్లాక్‌లో పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. చేపడుతున్న పనుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతి అనుకున్న విధంగా లక్ష్యాలు సాధించడంలో ఆశాజనకంగా లేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మందకొడిగా పనులు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆశావాహ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా మలవిసర్జన రహిత గ్రామాలు తయారుకావాలని సూచించారు. సమావేశంలో ఆశావాహ బ్లాక్ ఇన్‌చార్జ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం
పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో సమీక్షించారు. వసతి గృహాల్లో ఎలాంటి ఆనారోగ్య సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు. వారంలో రెండు రోజులు ఏఎన్‌ఎంలు విద్యాసంస్థలను సందర్శించి, తనిఖీలు చేయాలని సూచించారు. నేత్ర వైద్య శిబిరాలను విరివిగా నిర్వహించి నేత్ర పరీక్షలను చేయాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, ఏపీఎంఐడీసీ ఈఈ ఎస్.ప్రభాకరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలి
అంగన్వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీడీపీఓలను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్ప న, బాల్య వివాహాల నిర్మూలన, పోషణ్ వాటిక నిర్వహణ తదితర అంశాలపై క్యాంప్ కార్యాలయం నుంచి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎంఎన్.రాణి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment