సీతానగరం: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి నిర్దేశించిన 48 గంటల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో బిల్లులు జమ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో రాష్ట్ర పౌరసరఫరాల మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా అంటిపేటలో రైతుల కళ్లాల్లో వేసిన వరికుప్పలను పరిశీలించి ధాన్యం దిగుబడి, బిల్లులు చెల్లింపులు, వ్యవసాయాధి కారులు, రెవెన్యూ అధికారులు అందిస్తున్న సేవల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న రైతు సేవాకాంద్రాన్నిసందర్శించి ధాన్యం కొనుగోలు, తేమశాతం నమోదు, రైతులకు డబ్బుల చెల్లింపు, ఇటీవల కురిసిన చిరుజల్లులకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు, ధాన్యం సేకరణపై ప్రశ్నలు వేశారు. క్షేత్రస్థాయిలో రైతుల గురించి కూడా పలు ప్రశ్నలు వేశారు. రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోందా? లేదా అని ఆరా తీశారు. తూకంలో ఏమైనా అధికంగా తీసుకుంటున్నారా? అనిరైతులను ప్రశ్నించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోగా డబ్బులు జమ అవుతున్న విషయాన్ని రైతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment