ఎర్రచందనం అమ్మకాల ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయం
బొబ్బిలి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనం వేలం అమ్మకాల ద్వారా అటవీ కార్పొరేషన్‌కు ఆదాయం లభిస్తోందని చైర్మన్ ఆర్‌వీఎస్‌కే రంగారావు అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం విదేశాల్లో ఎర్రచందనానికి మార్కెట్ మందకొడిగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖకు సంబంధించి ఆయనతో చర్చించి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తామన్నారు. అడవుల్లో వాణిజ్య పంటలకు గిట్టుబాటు వ్యాపారం జరిగేలా నీలగిరి, కాఫీ తదితర పంటలను సాగు ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎర్రచందనం విక్రయాలకు ఏజెంట్‌గా కార్పొరేషన్ వ్యవహరిస్తోందని చెప్పారు. ఎకో టూరిజంకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా ఆయనతో పాటు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనను అభిమానులు సత్కరించారు. కార్యక్రమంలో వారి సోదరుడు రామ్‌నాయ న, పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబార్కి శరత్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు రౌతు రామ్మూర్తి నాయుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment