క్రీస్తు మార్గం అనుసరణీయం
విజయనగరం అర్బన్: ఏసు క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలు సర్వమానవాళికి అనుసరణీయమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ సుగుణాలను ప్రతి ఒక్కరూ అలవాటు చేసు కుని జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారుల సంఘం కలెక్టర్‌ను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది. బిషప్ డాక్టర్ సత్యరాజ్ క్రీస్తు సందేశాన్ని చదివి వినిపించి అందరికీ దీవెనలు అందజేశారు. కలెక్టర్ క్రిస్మస్ కేక్‌నుకట్‌చేసి జేసీ సేతు మాధవన్‌కు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, సీపీఓ బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రేమ, కరుణకు ప్రతిరూపం ఏసు
విజయనగరం రూరల్: ప్రేమ, కరుణ, దయకు ప్రతిరూపం ఏసయ్యని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నా రు. ఏసు చూపిన మార్గం మానవాళికి అనుసరణీయమన్నారు. క్రైస్తవులకు మంగళవారం ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
వినతుల పరిష్కారంలో వెనుకంజలో ఉన్నాం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వినతుల పరిష్కారంలో జిల్లా వెనుకంజలో ఉందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినతుల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇకపై ప్రతి రోజూ సాయంత్రం రెవెన్యూ సదస్సులపై సమీక్ష నిర్వహించాలని జేసీకి సూచించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, తహసీల్దార్లు, డీటీలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
జనవరిలో సామూహిక గృహప్రవేశం
విజయనగరం అర్బన్: జనవరి మొదటి వారంలో సామూహిక గృహప్రవేశాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, జిల్లాలో వారంలోగా 1,492 గృహ నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గృహనిర్మాణ సంస్థ ఈఈ, డీఈ, ఏఈలతో గృహనిర్మాణాలపై మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సమీక్షించారు. వాటిని పూర్తి చేయించి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని అప్‌లోడ్ చేయించాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కూర్మినాయుడు, ఈఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నిరసన
విజయనగరం అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కించపరుస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు ఖండించారు. తక్షణమే అమిత్‌షా తన పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం బాలాజీ కూడలిలోని అంబేడ్కర్ విగ్ర హం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బహజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment