రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం విజయనగరం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. రూరల్ సర్కిల్ పరిధిలోని గంట్యాడ, విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల వివరాలను స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌ఫర్మేషన్ రిజిస్టర్, క్రైమ్ రిజిస్టర్, క్రైమ్‌చార్ట్, ఎస్‌బి ఫోల్డర్లు, క్రైమ్ మెమోస్, విలేజ్ రోస్టర్, జి.ఎల్.రోస్టర్, తదితర వాటిని పరిశీలించారు. అంతకుముందు ఆధునీకరించిన రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. వార్షిక తనిఖీల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, ఎస్‌బీ సీఐ ఎ.వి.లీలారావు, రూరల్ ఎస్‌ఐ వి.అశోక్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు
ఏర్పాటుచేయాలి
మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలి
ఆధునీకరించిన రూరల్ సర్కిల్
కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ వకుల్ జిందాల్
Comments
Please login to add a commentAdd a comment