● పరిశ్రమలకు గడ్డుకాలం
బొబ్బిలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తపరిశ్రమల ఏర్పాటు పక్కన పెడితే విద్యుత్ చార్జీల భారం మోయలేక ఉన్న పరిశ్రమలు మూతపడే గడ్డు పరిస్థితి దాపురించిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల్లో 13 పరిశ్రమలు విజయనగరం జిల్లాలోనే ఉన్నాయి. వీటిలో 12వేల మంది కార్మికులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుత సర్దుబాటు చార్జీల లెక్కల ప్రకారం.. రోజుకు 26 టన్నులు ఉత్పత్తిచేసే పరిశ్రమలో 4వేల యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. దీనికి రూ.1.88లక్షల చొప్పున నెలకు రూ.56.17 లక్షల మేర విద్యుత్ బిల్లు చెల్లించాలి. అదే 10 ఫర్నేసులు వినియోగించే పెద్ద పరిశ్రమలకు నెలకు రూ.6.50 కోట్ల మేర విద్యుత్ చార్జీలు చెల్లించాలి. ఇంత భారం మోయడం సాధ్యంకాదన్నది పరిశ్రమ వర్గాల మాట. పరిశ్రమలు మూతపడితే వేలాది మందికి ఉపాధి కరువవుతుందన్న ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఇవ్వడంతో పరిశ్రమలకు రూ.9 కోట్ల మేర భారం తగ్గేదని పరిశ్రమ వర్గాలే చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment