జిల్లా జైలు నిర్మాణానికి స్థల పరిశీలన
విజయనగరం క్రైమ్: జిల్లాలో జైలు నిర్మాణానికి స్థల పరిశీలన చేసినట్టు జైళ్ల శాఖ కోస్తాంధ్రా డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో జైలు నిర్మాణానికి చర్యల చేపట్టామన్నారు. మండల పరిధిలోని సారిక గ్రామ సమీపంలో అందుబాటులో ఉన్న ఏడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు. జైలు నిర్మాణానికి పది ఎకరాల భూమి అవసరం కాగా, సారిక గ్రామం వద్ద ఏడు ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఆయన వెంట జిల్లా సబ్ జైళ్ల శాఖ ఇన్‌చార్జి ఎస్.శివప్రసాద్, సబ్ జైళ్ల పర్యవేక్షణాధికారి బి.సంపత్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
కోస్తాంధ్ర జైళ్ల శాఖ
డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్
Comments
Please login to add a commentAdd a comment