● విద్యుత్ వినియోగదారులపై కూటమి సర్కా రు చార్జీల మోతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న విద్యుత్‌శాఖ కార్యాలయాల వద్ద శుక్రవారం పోరుబాట సాగనుంది. ప్రజల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోరాటాన్ని చేపట్టింది. రైతుల సమస్యలపై ఈ నెల 17వ తేదీన కలెక్టరేట్‌ల వద్ద ధర్నా చేపట్టింది. ఈ పోరాటానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2025 జనవరి 3వ తేదీన ధర్నా చేపట్టనుంది. నేడు జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ చార్జీల బాదుడుపై నిరసన ర్యాలీలు నిర్వహించనుంది.
● చీపురుపల్లిలో జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద పోరుబాట చేపట్టనున్నారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలోవిద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నారు. నెల్లిమర్లలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలోను, రాజాంలో సమన్వయకర్త తలే రాజేష్ ఆధ్వర్యంలోను, ఎస్.కోటలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, విజయనగరంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో విద్యుత్‌శాఖ కార్యాలయాల వద్ద పోరుబాట నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment