ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగడారుడే | - | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగడారుడే

Published Wed, Dec 25 2024 1:07 AM | Last Updated on Wed, Dec 25 2024 1:07 AM

ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగడారుడే

ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగడారుడే

విజయనగరం అర్బన్‌: ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగదారుడేనని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ అన్నారు. వినియోగదారులంతా తమ హక్కులను తెలుసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వినియోగదారుడు వస్తు, సేవలపై సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్‌ అధ్య క్షుడు, న్యాయమూర్తి ఆర్‌.వెంకట నాగసుందర్‌ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను వివరించారు. జిల్లా కమిషన్‌ పరిధిలో సుమారు రూ.50 లక్షల విలువైన వ్యాజ్యాలు వేసే అవకాశం ఉందన్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, నిర్మాణం, రవాణా, గ్యాస్‌, విద్యుత్‌ తదితర రంగాలకు చెందిన సేవా లోపాలపై కమిషన్‌ను ఆశ్రయించవచ్చన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యురాలు బి.శ్రీదేవి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, చట్టాలను వివరించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ వినియోగదారుల న్యాయపాలనకు వర్చువల్‌ విచారణ, డిజిటల్‌ సౌలభ్యం ఇతివృత్తంగా ఈ ఏడాది వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సైబర్‌ క్రైమ్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌, ఐఓసీ సేల్స్‌ ఆఫీసర్‌ యోగేష్‌ కుమార్‌, జిల్లా ఔషధ నియంత్రణశాఖ ఏడీ రజిత, జిల్లా ఆహార భద్రతాధికారి వెంకటరమణ, సీడీపీఓ ప్రసన్న, తూనికల కొలతల శాఖ డీసీ దామోదరనాయుడు, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ సురేష్‌, ఆశరా జాయింట్‌ సెక్రటరీ ఎం.చంద్రశేఖర్‌, డీసీఐసీ జిల్లా కార్యదర్శి ఎస్‌.కామేశ్వరరావు వినియోగదారుల హక్కులను తెలియజేశారు. మేలుకొలువు మాసపత్రికను ఆవిష్కరించారు. వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. కార్యక్రమంలో వివిధ వినియోగదారుల సంఘాలు ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవవన్‌

ఘనంగా వినయోగదారుల దినోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement