వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలపై విద్యుత్‌చార్జీల భారం వేసి వారి జీవితాలను ఛిద్రం చేస్తోందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగించేవారి నుంచి ఎలాంటి బిల్లులు వసూలు చేయలేదని, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన పాత బకాయిలతో కలిపి చార్జీలు వసూలు చేయడం విచారకరమన్నారు. 60 నుంచి 70 యూనిట్లు వినియోగించిన వినియోగదారులకు రూ.3వేల నుంచి రూ.6వేల చొప్పున బిల్లులు ఇస్తున్నారన్నారు. జిల్లాలోని మెంటాడ మండలం లోతుగెడ్డ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఇదే తరహాలో బిల్లులు వచ్చాయన్నారు. త్వరలో వికసిత్ భారత్ పేరిట పట్టణ ప్రజలపై యూజర్‌చార్జీల భారం మోపేందుకు కూటమి సర్కారు సన్నద్ధమవుతోందన్నారు. ఇప్పటికే తల్లికివందనం (అమ్మ ఒడి) అందక చాలా మంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, మహిళలకు పథకాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment