సర్వమానవాళికి యేసే రక్షకుడు
● ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు ప్రేమానందం
విజయనగరం టౌన్: సర్వమానవాళికి యేసే లోకరక్షకుడని ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రేమానందం తెలిపారు. ఈ మేరకు స్థానిక వీటీ అగ్రహారంలో ఉన్న న్యూ టెస్ట్‌మెంట్ చర్చి ఆవరణలో క్రిస్మస్ వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తుప్రేమను ప్రతి ఒక్కరూ పొందాలన్నారు. మన పాపాల నుంచి విముక్తి కల్పించి శాంతిమార్గంలో నడిపించే దేవుడని కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెవరెండ్ నికొడెమస్ మాట్లాడుతూ దేవుని సువార్తను విశ్వజనీనం చేయాలన్నారు. అనంతరం 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి పద్మావతి కేక్ కట్ చేశారు. 47వ వార్డు కార్పొరేటర్ పట్నాన పైడిరాజు క్యాండిల్స్ వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. రెవరెండ్ సుకుమార్ చౌదరి అద్భుతమైన సాక్ష్యాన్ని, దైవసందేశాన్ని అందించారు. ఎన్‌టీసీ చర్చి క్వయర్ టీమ్ ఆలపించిన క్రీస్తు గీతాలాపన ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. ఏంజెల్, చార్లెస్ డాని ప్రేమ్సన్, టి.సారమ్మ, జామి అప్పలనాయుడు, కోరాడ శ్రీరాములు, బి.సంతోష్, బి.రాంబాబు, ఎన్.లక్ష్మి, ఎస్.కాంతారావు, ఎస్.హరీష్, డి.కృష్ణ, జి.శామ్యూల్, ఎన్.ప్రభుకుమార్, అధిక సంఖ్యలో క్రైస్తవులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment