పేదోడి సొంతింటి కల సాకారంలో రాజన్నదొర ముద్ర
సాలూరు: గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో సొంత ఇల్లు అంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చాలా కష్టమైన పనే. అటువంటి పేదవాడి సొంతింటి కలను సాలూరు పట్టణంలో సాకారం చేసిన అంశంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెరగని ముద్ర వేసుకున్నారు. ఓ వైపు టిడ్కో ఇళ్లతో పాటు మరోవైపు నెలిపర్తి , గుమడాం తదితర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుచేయించి పేదవానికి సొంత గూడుకు తనవంతు ప్రయత్నాన్ని రాజన్నదొర చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కృషితో ఇళ్లతో పాటు పూర్తి మౌలిక వసతుల కల్పనతో పట్టణంలోని గుమడాం సమీపంలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment