వాన.. కన్నీరు
బొబ్బిలిరూరల్: కారాడ గ్రామంలో వర్షపునీటిలోనే ఉన్న వరి చేను కుప్పలు
విజయనగరం ఫోర్ట్:
వాన.. రైతన్నను కన్నీరుపెట్టిస్తోంది. పంట సాగు సమయంలో కురవని వర్షం.. చి‘వరి’లో తుఫాన్‌ల రూపంలో కురుస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షపు నీరు ముంచెత్తిన పొలాలను చూసి గగ్గోలు పెడుతున్నారు. కష్టమంతా నీటిపాలైందంటూ రోదిస్తున్నారు. వరుసగా ఏర్పడిన ఫెంగల్, అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో రోజుల తరబడి వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాల్లో నీరు చేరింది. రోజుల తరబడి వరి పనలపై నీరు నిల్వ ఉండిపోయింది. కుప్పలు సైతం నీటిలోనే 15 రోజులుగా నానుతున్నాయి. కొన్నిచోట్ల ధాన్యం రంగు మారి, మొలకలు వచ్చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో కోతలు వాయిదా వేసినా.. చేనంతా పండిపోయి కుళ్లిపోతోంది.
880 ఎకరాల్లో వరి పంటకు నష్టం
గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు వరి పంట తడవడంతో జిల్లా వ్యాప్తంగా 880 ఎకరాల్లో కుప్పలు, పనలపై ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లింది. పంటను నూర్పు చేయడానికి కూడా రైతులకు అవకాశం లేని పరిస్థితి.
రైతన్నను వీడని వర్షం
తడిసి ముద్దవుతున్న వరి పంట
వర్షానికి పాడైన ఉద్యానవన పంటలు
15 రోజులుగా తడుస్తున్న వరిచేను
ఆవేదనలో అన్నదాత
Comments
Please login to add a commentAdd a comment