బతుకంతా బరువే..
రామభద్రపురం:
రామభద్రపురం అంతర్‌రాష్ట్ర మార్కెట్‌లో దొరికిన పనిపైనే సుమారు 30 కళాసీ కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి. కూరగాయల బస్తాలు, సిమెంట్, ఐరన్‌ను బస్సులు, లారీలకు లోడింగ్, అన్‌లోడింగ్ చేయడం, దుకాణాలకు తరలించడం వీరి దినచర్య. 30 మంది కళాసీలు రెండు బ్యాచ్‌లుగా విడిపోయి రోజుకో బ్యాచ్ చొప్పున పనిలో పాల్గొంటారు. వీరు వేకువజాము నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తే చేతికొచ్చేది రూ.600. ఒక్కో బ్యాచ్‌కు 15 రోజులే పని ఉండడంతో నెలకు వచ్చిన రూ.9000 సంపాదనతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అన్‌సీజన్‌లో అయితే ఆర్థిక కష్టాలే ఎదురవుతాయి. కొన్నిసార్లు బస్సులకు బరువైన బస్తాలను ఎక్కించే సమయంలో ప్రమాదాల పాలై కాళ్లు, చేతులకు గాయాలైన ఘటనలు కోకొల్లలు. అలాంటి సమయంలో వీరిని ఆదుకునేవారూ కరువే. మార్కెట్ ఆదాయం రూ.లక్షల్లో వస్తున్నా పంచాయతీ అధికారులు, ప్రభుత్వం వీరి సంక్షేమం గురించి ఆలోచించే దాఖలా లేవు. దీంతో ప్రతినిత్య బతుకు పోరాం సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment