‘సంకల్పం’ నెరవేరేలా...
విజయనగరం క్రైమ్:
జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు తలపెట్టిన ‘సంకల్పం’ నెరవేరేలా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంకల్ప రథం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలు, పాఠశాలలు, ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నట్టు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఒక మండలంలోని ఒక కళాశాల, ముఖ్య కూడళ్లలో వాహనాన్ని నిలిపి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై వీడియోలు ప్రదర్శించి వివరిస్తున్నారన్నారు. జనవరి మాసాంతానికి జిల్లాలోని అన్ని మండలాలను సంకల్పరథం సందర్శించేలా షెడ్యూల్ రూపొందించామని తెలిపారు.
● మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రచారం
● ఎస్పీ వకుల్ జిందాల్
Comments
Please login to add a commentAdd a comment